వచ్చే విద్యా సంవత్సరంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాబోతున్నారని తెలిపారు మంత్రి గుడివాడ అమర్నాథ్. సీఎం ప్రకటించే నాటికి నెలల్లో ఉన్న సమయం ఇప్పుడు రోజుల్లోకి వచ్చిందన్నారు. 13లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నప్పుడు ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందన్నారాయన. ఎన్నికల కోడ్ కారణంగానే ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటించ లేకపోయామన్నారు మంత్రి అమర్నాథ్.
ఈనెల 18 తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ విడుదల అవుతుందన్నారు. డిసెంబర్ 23 నాటికి రామాయపట్నం ఆపరేషన్స్ ప్రారంభం అవుతాయని.. ఆ రోజు తొలి వెసల్ రాబోతోందని వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం తర్వాత రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామన్నారు. సీఎం జగన్ ఒక బ్రాండ్ అని అన్నారు. మూడేళ్ళలో ఒప్పందం చేసుకున్న 89శాతం పెట్టుబడులను రాబట్టగలగడం వైసీపీ ప్రభుత్వంకు ఉన్న ట్రాక్ రికార్డ్ అన్నారు.
ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వచ్చే నెల నుంచి కార్యాచరణలోకి వస్తాయన్నారు. చీఫ్ సెక్రెటరీ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ ప్రతీవారం సమీక్షిస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను లీజ్ డీడ్ విధానం అనుసరిస్తున్నామన్నారు. ఐటీ & ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన 35వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు వచ్చాయన్నారు.