నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేసినట్లు వెల్లడించారు. రైతులకు కనీసం మద్దతు ధర కన్నా ఒక్క పైసా కూడా తగ్గకుండా రేటు రావాలన్నారు. అందుకే మిల్లర్ల ప్రమేయాన్ని తీసి వేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం జగన్.
ఈ నూతన విధానం ఎలా అమలవుతుందో గమనించుకుంటూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చేయాల్సిన ధాన్యం సేకరణ పై ముందస్తుగా అంచనాలు వేసుకొని గోనె సంచులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇక యాప్ లో సిగ్నల్స్ సమస్య ఉన్నందున ఆఫ్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రవాణా ఖర్చులు, గన్ని బ్యాగుల ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్న విషయం రైతులకు తెలియాలని ఆదేశించారు.