ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పార్లమెంట్ లో వివరిస్తాం : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

-

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం టీడీపీ పార్లమెంటరీ నేత ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. తమ వైపు నుంచి అన్ని సలహాలు ఇచ్చామని.. 2024 ఎన్నికల్లో టీడీపీ అద్భుతమైన విజయం సాధించిందన్నారు. రాష్ట్రం నుంచి 21 ఎన్డీఏ ఎంపీలు ఉంటే అందులో 16 మంది టీడీపీ ఎంపీలు ఉన్నారని చెప్పారు. ఎంపీలు నియోజకవర్గం సమస్యలపై మాట్లాడే ఓ అవకాశం ఇవ్వాలని కోరామన్నారు.

 

రాష్ట్ర ఆర్థిక అంశాలపై అసెంబ్లీలో వైట్ పేపర్ విడుదల చేస్తున్నారని.. దాన్ని పార్లమెంట్కు కూడా వివరిస్తామన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పార్లమెంట్లో వివరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ అడుగుతామనేది పార్లమెంట్ వేదికగా ప్రజలకు తెలుస్తుందన్నారు. అమరావతి, పోలవరం పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఎంపీ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధంగా లేమని సీఎం చంద్రబాబు చెప్పారని.. అమరావతి అభివృద్ధి, రోడ్ల నిర్మాణం ఇతర అంశాలపై పార్లమెంటులో చర్చిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version