చంద్రబాబుని భూతం లాగా చూపించడానికి కేసీఆర్ ఫామ్ హౌజ్ లోపల కూర్చొని క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్లప సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు లక్ష కోట్లు, కరెంటు బిల్లు రూ.7 వేల కోట్లు అని ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మించి 50 వేల ఎకరాలకే నీరు ఇచ్చారని ఫైర్ అయ్యారు.

2007లో 34 వేల కోట్లతో గోదావరిపై అతిపెద్ద ప్రాజెక్టు ప్రాణాహిత, చేవెళ్లను ఆనాడు వైఎస్ఆర్ ప్రారంభించారు… 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఊరు, పేరు, అంచనాలు మార్చేసి లక్షన్నర కోట్లతో కాళేశ్వరం అన్నారని పేర్కొన్నారు. ఈ రోజు ఏపీ ప్రభుత్వం బనకచర్ల చేపట్టడానికి కారణం కేసీఆరే అని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.
చంద్రబాబుని భూతం లాగా చూపించడానికి కేసీఆర్ ఫామ్ హౌజ్ లోపల కూర్చొని క్షుద్ర పూజలు చేస్తున్నాడు – సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/GQSgIo0Suu
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2025