ఒంటిమిట్ట గురించి చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే..?

-

ఈ రోజు (శుక్ర‌వారం) రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం జరుగుతున్న సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. విభజన కారణంగా భద్రాద్రిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ లోటు కనపడనీయకుండా, కడప జిల్లాలో 450 ఏళ్ళ చరిత్ర కలిగిన కోదండ రామాలయాన్ని గత తెలుగుదేశం హయాంలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేశాం. ఒంటిమిట్ట ఆలయ నిర్వహణలో లోపాలు రాకూడదన్న స‌దుద్దేశంతో టీటీడీ పరిపాలన కిందకు తెచ్చాం. కళ్యాణ వేదికను నిర్మించి ఆలయానికి కొత్త శోభను తెచ్చాం. తెలుగుదేశం పార్టీ తెలుగువారి సాంస్కృతిక వారసత్వానికి అండగా నిలుస్తుంది అనేందుకు ఇదొక గొప్ప నిదర్శనం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version