బీహార్ రాష్ట్రంలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ… అలెర్ట్ ప్రకటించిన అధికారులు

-

బీహార్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఆ రాష్ట్రంలో సుపాల్ జిల్లాలో వరసగా పక్షులు చనిపోతుండగా… సాంపిల్స్ టెస్ట్ చేయగా ఏమియన్ బర్డ్ ప్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (హెచ్5ఎన్1) గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వ్యాధి సోకిన ప్రాంతం నుంచి కిలోమీటర్ వ్యవధి వరకు ఫౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లను చంపేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో చికెన్ తినకుండా చూడాలని జిల్లా అధికారులు ప్రజలను ఆదేశించారు. 

ఇటీవల సుపాల్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చప్కాహి గ్రామంలో మార్చి 31న అనుమానాస్పదంగా బాతులు, కోళ్లు, ఇతర పక్షులు చనిపోవడంతో అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే వెటర్నరీ వైద్యులు ఎంత ట్రీట్ మెంట్ అందించినా.. పక్షులు కోలుకోలేక పోవడంతో వాటి శాంపిళ్లను భోపాల్ లోని ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపగా.. బర్డ్ ఫ్లూ సోకినట్లు నివేదికలు వచ్చాయి. దీంతో అధికారులు వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. చాప్కాహి గ్రామం నుండి ఒక కి.మీ పరిధిలోని ప్రాంతాన్ని వ్యాధి సోకిన ప్రాంతంగా ప్రకటించారు. చాప్కాహి గ్రామానికి ఒక కిమీ పరిధిలో ఉన్న పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లను చంపి,  పాతిపెట్టేందుకు స్పెషలిస్ట్ పశుసంవర్ధక అధికారులు, వెటర్నరీ వైద్యులతో 4 ర్యాపిడ్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version