దావోస్ పర్యటనకు అర్ధాంగిని మాత్రమే ఎందుకు తీసుకెళ్లాడు జగన్ రెడ్డి?: వంగలపూడి అనిత

సీఎం జగన్ దావోస్ పర్యటన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. సీఎం జగన్ పర్యటన పై టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బదులు ఇవ్వడం తెలిసిందే. అయితే బుగ్గన వివరాలపై టిడిపి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు.

32 మంది కమ్మ డీఎస్పీల ప్రమోషన్ అబద్ధం అని అసెంబ్లీలో తేలిన అప్పటి నుంచి మీ కథలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదని బుగ్గనకు అనిత కౌంటర్ ఇచ్చారు. గంటకు రూ. 12 లక్షలు ఖర్చుపెట్టి కేవలం అర్థాంగిని మాత్రమే ఎందుకు తీసుకెళ్లాడు జగన్ రెడ్డి.? అంటూ అనిత ప్రశ్నించారు. దీనికి కూడా ఓ బుర్ర కథ చెప్పండి బుగ్గన గారు! అంటూ ఎద్దేవా చేశారు. తోటి మంత్రులు, అధికారులను వెంటపెట్టుకుని వెళ్లలేదే..? అంటూ నిలదీశారు.