తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్…ఇవాళ వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. ఇవాళ అంటే జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ భక్తి, శ్రద్ధలతో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవం రోజున తెలుగు రాష్ట్రాలలో వైన్ షాపులు, మాంసం దుకాణాలు మూసి వేస్తారన్న సంగతి తెలిసిందే.
కాగా, ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని అధికారులు చెబుతున్నారు. అన్ని రకాల మటన్, చికెన్, చేపల మార్కెట్లను ఇవాళ మూసివేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సూచనలు జారీ చేసింది. రూల్స్ ను అతిక్రమించి ఎలాంటి జంతువులను వధించిన కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, చాలా పట్టణాలలో ఇదే తరహా ఆదేశాలు జారీ అవుతున్నాయి. హైదరాబాద్ లో కూడా ఇవే ఆంక్షలు కొనసాగుతున్నాయి.