తెలంగాణ ప్రజలకు శుభవార్త..ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి రోజున తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టునున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మినహా మండలానికి ఒక అధికారిని ఎంపిక చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మార్చి 31వ తేదీలోగా నాలుగు పథకాలను 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక దీనిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో పథకాల అర్హుల వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగలేక పోయినా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని… తల తాకట్టు పెట్టైనా పేద వాడికి అండగా ఉండాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అందరికి రేపే ఇవ్వాలని అనుకున్నాం. గ్రామ సభల్లో వచ్చిన వివరాల ఆధారంగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగించాలనుకుంటున్నామన్నారు.