విచారణకు రావాలంటూ చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు

-

విజయవాడ ఆస్పత్రిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ను బెదిరించారు అన్న ఆరోపణలపై టిడిపి అధినేత, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు మహిళా కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.నోటీసు కాపీని చంద్రబాబుకు అందించేందుకు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయానికి వెళ్లిన మహిళా కమిషన్ ప్రతినిధుల నుంచి పార్టీ కార్యాలయ వర్గాలు నోటీసును అందుకున్నాయి.

ఈనెల 27న ఉదయం 11 గంటలకు కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ సదరు నోటీసుల్లో చంద్రబాబును మహిళా కమిషన్ కోరింది.విజయవాడ ఆస్పత్రిలో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన లో బాధితురాలి పరామర్శ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను అవమానించారని సదరు నోటీసుల్లో చంద్రబాబుకు కమిషన్ తెలిపింది.ఏపీ మహిళా కమిషన్ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version