ఈనెల 9 నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం

-

ఈనెల 9 నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం వస్తున్న నేపథ్యంలో…ప్రతి మండలంలో ప్రతిరోజూ ఒక సచివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్లతో సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ… ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచిని ప్రజలకు చెప్పాలన్నారు.

Y AP Needs Jagan Program from 9th of this month

గ్రామాల వారీగా ఎంత నగదు బదిలీ చేశాం.. తద్వారా ఎంతమందికి ఏ మేరకు లబ్ధి జరిగిందన్న దానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలని కోరారు. గ్రామాల్లో ఆర్బీకే సెంటర్లు, సచివాలయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులను నాడు–నేడు రూపంలో వివరించాలని…ఇలా గతానికి భిన్నంగా మెరుగుపడిన పరిస్థితుల తీరును తెలియజేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బోర్డులు పెట్టాలి…ఏయే పథకం ద్వారా ఎంతమంది లబ్ధిపొందారో అందులో ప్రదర్శించాలని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version