YCP : డిప్యూటీ సీఎం నారాయణస్వామికి టికెట్ రాకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆయన కార్యకర్తలు అంటున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి పుత్తూరు నివాసంలో ఆరు మండలాల నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగాఆరు మండలాల నాయకులు ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.
నారాయణ స్వామీకి టికెట్ ఇవ్వకపోతే పార్టీ కూడా మాకు అవసరం లేదని..నారాయణస్వామి మీద కుట్రలు కుతంత్రాలు చేసి టికెట్ రాకుండా మీరు చేస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామని ఈ సందర్భంగా కార్యకర్తలు అన్నారట. అటు ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు టికెట్ రాకపోతే ఆత్మ అభిమానాన్ని చంపుకొని జ్ఞానేందర్ రెడ్డి తో కలిసి పనిచేయనన్నారు. నా కు ఏం ఆస్తులు, అంతస్తుల లేవని….జ్ణానేందర్ రెడ్డితొ కలిసి వెళ్ళే ప్రసక్తి లేదన్నారు.