మూడో ఛాప్టర్ కాదు…అది మీకు “మూడే” ఛాప్టర్ నారా లోకేశ్ అంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ మూడో ఛాప్టర్ తెరుస్తానని సంచలన కామెంట్స్ చేశాడు. ప్పటికే రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయి. త్వరలో మూడో చాప్టర్ మొదలుకాబోతోందని వైసీపీ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.
త్వరలోనే మూడో చాప్టర్ ప్రారంభం చేస్తానని లోకేష్ చేసిన హెచ్చరికలపై వైసీపీ Xలో సెటైర్లు వేశారు. “మూడో ఛాప్టర్ కాదు లిక్కర్ మంత్రి… అది మీకు మూడే ఛాప్టర్. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన మీరు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు, అనుచరులు, పోలీసులను బానిసలుగా చూడటాన్ని మేము పట్టించుకోలేదు అనుకుంటున్నారా? మీ అన్ని ఛాప్టర్లు ముగిసే సమయం అతి దగ్గరలోనే ఉంది గుర్తుంచుకోండి” అంటూ పేర్కొన్నారు. ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి.