వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నానికి ఘోర పరాజయం ఎదురైంది. తన సొంత ఇలాకా గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని ఘోర ఓటమి చవి చూశారు. టీడీపీ క్యాండిడేట్ రాము 51 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించి.. పదేళ్ల తర్వాత గుడివాడలో టీడీపీ జెండాను రెపరెపలాడించాడు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై వైసీపీలో మరే నేత కూడా చేయనన్ని విమర్శలు కొడాలి నాని చేస్తుంటారు.
ముగ్గురి పేరు చెబితే నాని ఒంటి కాలిపై లేస్తారు. దీంతో ఈసారి గుడివాడలో నానిని ఎలాగైనా ఓడించాలని బాబు, కల్యాణ్ కంకణం కట్టుకుని ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే చంద్రబాబు పలుమార్లు గుడివాడలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బాబు వ్యూహం వర్కౌట్ అయ్యి ఈ ఎన్నికల్లో కొడాలి నాని ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. మరోవైపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలల్లో ఊహించని రితీలో వెనకబడ్డ అధికార వైసీపీ ఘోర ఓటమి దిశలో పయణిసోంది.