ఎన్టీఆర్‌ను నేను పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు – లక్ష్మీపార్వతి

-

నేను ఎన్టీఆర్‌ను పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. ఏ సంఘటన జరిగినా నా పై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని..చరిత్ర చెరిపితే చెరిగిపోదని మండిపడ్డారు లక్ష్మీ పార్వతి.

ఎన్టీఆర్‌కు నాతో పెళ్లి అవటం చంద్రబాబుకు ముందు నుంచీ ఇష్టం లేదని.. మా వివాహ ప్రకటనను అడ్డుకోవటానికి చంద్రబాబు మైకు వైరులు కట్ చేసి లైట్‌లు ఆఫ్ చేసి నానా బీభత్సం చేశాడని ఆగ్రహించారు.

అందరి సమక్షంలో జరిగిన మా వివాహం గురించి ఎవరైనా అనుచితంగా వ్యాఖ్యానిస్తే కేసు పెడతానని… నేను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. ఎన్టీఆర్ భార్య పదవికి మించి ఇంకే పదవి నాకు పెద్దది కాదు.. ఎన్టీఆర్ పెరాల్సిస్ అనారోగ్యం, పిల్లలకు ఆస్తుల పంపకాలు, అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో నేను ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చానని వివరించారు. నేను వచ్చిన తర్వాత ఆరోగ్యమే కాదు అధికారం కూడా తిరిగి వచ్చిందని పేర్కొన్నారు లక్ష్మీ పార్వతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version