మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. విశాఖ పినాకిల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవలే కరోనా నుండి కోలుకున్న శ్రీనివాస్ కి మళ్ళీ అనారోగ్యం రావడంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్ను మూశారు. కరోనా వైరస్ వల్ల ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందని అంటున్నారు. పదిహేను రోజుల క్రితం వెంటిలేటర్‌తో పాటు ఎక్మో ట్రీట్మెంట్ కూడా ఆయనకు చేశారు.
ఆయన వైసీపీలో ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాఖ విఎంఆర్డిఎ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ తండ్రి మరణించగా ఏర్పడ్డ దక్షిణ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడ్డ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ టిక్కెట్టు మీద పోటీ చేసి కాంగ్రెస్ కే విధేయుడిగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో అనూహ్య రీతిలో వైసీపీలో చేరి దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆత్బ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు . అయినప్పటికీ ద్రోణంరాజు శ్రీనివాస్ కు వైసీపీ వీఎంఆర్‌డీఏ చైర్మన్ పదవినిచ్చింద.