YCP leader Lakshmi Parvati resigns: వైసీపీ నాయకురాలు లక్ష్మి పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నాయకురాలు లక్ష్మి పార్వతి రాజీనామా చేశారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా పని చేస్తున్న ఆమె తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారు. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న నేతలు వరుసగా రాజీనామా చేస్తున్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/YCP-leader-Lakshmi-Parvati-resigns.webp)
అటు ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. ఇక నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది . దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు.