తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

-

తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్. ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 17వ తేదీ వరకు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషన్ అధికారులు తెలిపారు. ఇందుకోసం తొలుత టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్‌ ద్వారా వ్యక్తిగత వివరాలను ధ్రువీకరించి, అభ్యంతరాలను ఆంగ్లంలో నమోదు చేయాలని వెల్లడించారు.

తగిన ఆధారాలు, పుస్తక రచయిత పేరు, పుస్తకంలో పేజీ నంబర్, పత్రిక ఎడిషన్, పేజీ నంబర్, పబ్లిషర్‌ పేరు వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ వివరాలను ఇవ్వాలని టీజీపీఎస్సీ అధికారులు చెప్పారు. ఈ-మెయిల్, వ్యక్తిగత విజ్ఞాపనలు, ఇతర పద్ధతుల్లో వచ్చే, గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్ష షెడ్యూలును తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు జరుగుతాయంది.

Read more RELATED
Recommended to you

Latest news