పారిశుద్ధ్య కార్మికురాలితో రోజా షాకింగ్ ప్రవర్తన.. వీడియో వైరల్

-

మాజీ మంత్రి, నటి రోజా పారిశుద్ధ్య కార్మికులతో షాకింగ్గా ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజాతో సెల్ఫీ తీసుకునేందుకు పారిశుధ్ధ్య కార్మికులు ఆమె వద్దకు వచ్చారు. వెంటనే ఆమె దూరంగా జరిగి వారిని నిల్చోమన్నట్లు చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రోజా ప్రవర్తనపై మండిపడుతున్నారు.

తమిళనాడులోని తిరుచ్చెందూర్‌ సుబ్రమణియస్వామి ఆలయంలో సోమవారం వరుషాభిషేకం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా, ఆమె భర్త సెల్వమణి స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కడున్న చాలా మంది వారితో సెల్ఫీ తీసుకున్నారు. అదే సమయంలో కొందరు మహిళా పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ దిగుదామని ఆమె వద్దకు వెళ్లారు. వెంటనే రోజా వారిని దూరం జరిగి నిల్చోవాలంటూ చేతులు చూపినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నారు. ఆ మహిళలతో రోజా ప్రవర్తించిన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో రోజాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version