120 రోజుల్లో 74 కు పైగా ఆడపిల్లలపై అత్యాచారాలు – రోజా

-

చంద్రబాబు ప్రభుత్వ చేతగాని తనం వల్లే.. 120 రోజుల్లో 74 కు పైగా ఆడపిల్లలపై అత్యాచార ఘటనలు జరిగాయని వైసీపీ నేత రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ స్టాపబుల్ షో లో.. నిస్సిగ్గుగా నవ్వుతూ బావా బామ్మర్ధులు ఎంజాయ్ చేస్తున్నారని ఆగ్రహించారు. తాజాగా సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత రోజా హాట్ కామెంట్స్ చేశారు.

YCP leader Roja made hot comments on CM Chandrababu.

మృత్యువుతో బాధిత మహిళ పోరాడుతుంటే.. స్పెషల్ విమానంలో హైదరాబాద్ కు చంద్రబాబు వెళ్లినట్లు చురకలు అంటించారు. వీళ్లకా మేము ఓటేసిందని ప్రజలు బాధపడుతున్నారన్నారు రోజా. పవన్ కళ్యాణ్.. షూటింగ్ లో బిజీగా ఉన్నారా..? అంటూ సెటైర్లు పేల్చారు. ఇందుకేనా మీకు ఓట్లు వేసిందని నిలదీశారు వైసీపీ నేత రోజా. ఎన్నికలకు ముందు.. ఆడవాళ్ల రక్షణ నా బాధ్యత అని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఈ రోజు ఇంతమంది ఆడపిల్లలపై రేప్ లు జరుగుతుంటే, చనిపోతుంటే.. మీ కళ్లకు కనిపించడం లేదా..? మీ చెవులకు వినిపించడం లేదా..? అని ఫైర్‌ అయ్యారు వైసీపీ నేత రోజా.

Read more RELATED
Recommended to you

Latest news