ఇప్పుడు ఏపీకి చంద్రబాబు నాయకత్వం అవసరం – వైసీపీ ఎంపీ

-

అభివృద్ధిలో అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కష్టించి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, ఆయన తన నాయకత్వంలో డ్యామేజ్ అయిన రాష్ట్రాన్ని అంచెలంచెలుగా సరి చేసుకుని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారనడంలో తనకు ఎటువంటి సందేహం లేదని చెప్పారు.

చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇప్పటికే కలిసిన జనసేనతో పాటు, భవిష్యత్తులో కలవనున్న బీజేపీతో కలిసి కూటమి అప్రహతీత విజయం సాధించడం ఖాయమని రఘురామకృష్ణ రాజు గారు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం తిరిగి అభివృద్ధిలో పుంజు కోవడం తధ్యమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఐదు నుంచి ఆరు శాతానికి తమ ఓటు బ్యాంకును పెంచుకోగలిగితే, రానున్న ఎన్నికల్లో అనుకున్న ఆ 15 స్థానాలు కూడా ప్రస్తుత అధికార పార్టీకి రాకుండా పోతాయని అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు బిటెక్ రవి గారిని గెలిపించుకోవడం మనందరి బాధ్యతగా భావించాలని, ఈ ఆనంద సమయంలో మరింతగా కష్టపడుదాం, ఈ దిక్కుమాలిన దరిద్రపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదాం అని, ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిద్దామని రఘురామకృష్ణ రాజు గారు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version