బీఆర్‌ఎస్ ఓడిపోవడం సంతోషకరంగా ఉందన్నారు బండి సంజయ్. బీజేపీ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు.. అవినీతి పాలనను ప్రజలు అంతమొందించారని వివరించారు. బండి సంజయ్‌ను ఓడించడమే లక్ష్యంగా ఓడగొట్టారు.. గెలిచినా ఓడినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు బండి సంజయ్.
దురదృష్టవశాత్తు కరీంనగర్ లో ముస్లింలు ఒకటయ్యారు. వక్ఫ్ బోర్డు భూమిని కబ్జా చేసినందుకు, ముస్లింల ఇండ్లు కూల్చిన వాళ్లకు సపోర్ట్ చేసినందుకు ఎంఐఎం పార్టీ వాళ్లకు సిగ్గు, లజ్జ ఉండాలని ఫైర్ అయ్యారు. దారుస్సలాం వెళ్లి తెల్ల టోపీ, పచ్చజెండా పట్టుకున్న వాళ్ళ కాళ్ళు మొక్కి ఎంఐఎం ఆశీర్వాదంతో, హిందూ ధర్మం కోసం పోరాటం చేసినటువంటి బండి సంజయ్ ని మూడుసార్లు ఓడగొట్టినటువంటి నిర్ణయాన్ని చూసిన తర్వాత హిందూ సమాజం ఏం ఆలోచించుకోవాలో ఆలోచించుకోండన్నారు. ఈ గెలుపు గెలుపే కాదు. బండి సంజయ్ కి గెలుపు, ఓటమి కొత్త కాదు. వాటి మీద ఆధారపడడు. గెలిచినా పని చేసినా, ఓడిపోయినా పని చేసిన. చివరకు నా లక్ష్యం బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే అన్నారు.