ఏపీ సీఐడీ అధికారికి షాక్ ఇచ్చిన రఘురామకృష్ణంరాజు

-

న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సీఐడీ అధికారులకు ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు షాక్ ఇచ్చారు. సీఐడీ అడిషనల్‌ డీజీపీ సునీల్‌కుమార్‌కు రఘురామ లీగల్‌ నోటీసు ఇచ్చారు.

తన ఐ ఫోన్ ఇవ్వాలని తిరిగివ్వాలని లేకపోతే క్రిమినల్ కేసులు వేస్తామని హెచ్చరించారు. తనను అరెస్ట్‌ చేసినప్పుడు తీసుకున్న ఐ-ఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదనే విషయాన్ని కూడా ఆయన నోటీసుల్లో ప్రస్తావించారు. ఫోన్‌లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్‌లోనే ఉందని.. పార్లమెంట్‌ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని తెలిపారు.

అయితే ఈ లేఖపై సీఐడీ అడిషనల్‌ డీజీపీ సునీల్‌కుమార్‌ ఇప్పటివరకూ స్పందించలేదు. కాగా తనను అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు దాదాపు ఎంపీలందరికీ రఘురామ కృష్ణంరాజు లేఖలు రాశారు. దీనిపై చాలా మంది తీవ్రంగా స్పందించి.. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరును తప్పుబట్టారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version