YCP Rajya Sabha MP Vijayasai Reddy has once again received ED notices : వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు అందాయి. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో ఎంపీ విజయసాయి రెడ్డికి మరోసారి ఈడి నోటీసులు అందాయి. గతంలో పార్లమెంట్ సమావేశాలతో విచారణకు హాజరు కాలేదు విజయసాయి రెడ్డి. అయితే… ఇప్పుడు విచారణకు హాజరు కావాలంటూ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ.
కాకినాడ పోర్టు మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడి విచారణ జరుగుతోంది. మరి మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అటు వైసీపీ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఒక్కో లీడర్ పార్టీ మారుతున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు అందాయి.