YCP youth leader Nagarjuna Yadav arrested: వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. వైయస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ అయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బెంగళూరు నుండి వస్తుండగా కుప్పం వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అయితే.. కొన్ని రోజుల క్రితం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కె వరుణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాగార్జునయాదవ్‌పై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని కొట్టివేయాలని నిందితుడు నాగార్జున యాదవ్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.అ కేసు విచారణ జరుగుతూన్న సమయంలోనే పోలీసులు నాగార్జున యాదవ్ ను అదుపులోకు తీసుకున్న విషయాన్ని ధృవీకరించని పోలీసులు ..నాగార్జున కు 41 సి నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.