మైలవరం నియోజకవర్గ ఎన్నికపై వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మైలవరం నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడి మార్పు చేసింది. అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో కర్రా హర్షా రెడ్డిని నియమించింది అధిష్టానం. నియమించి నెల రోజులు పూర్తవ్వకముందే అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి ని పరిశీలకుడి పదవి నుండి తప్పించింది వైసీపీ పార్టీ అధిష్టానం.
ఐ ప్యాక్ టీంతో నియోజకవర్గ కార్యకర్తల గొడవ నేపద్యంగానే పరిశీలకుడిని మార్చినట్లు సమాచారం అందుతోంది. ఇన్చార్జి సర్నాల తిరుపతిరావు యాదవ్ ఫోటోల కంటే పరిశీలకుడు కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెద్దవి పెట్టుకున్నారని సోషల్ మీడియా లో హల్చల్ చేశాయి పోస్టులు. ఐ ప్యాక్ టీం రుగ్వేద ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో సోషల్ మీడియా లో పార్టీ కార్యకర్త పోస్ట్ పెట్టారు. ఈ విషయమై ఐ ప్యాక్ టీం నాగేంద్ర , రెడ్డిగూడెం మండల పార్టీ కార్యకర్త మద్య బూతులతో కూడిన వాగ్వాదం నెలకొంది. ప్రస్తుతం వారి ఆడియో వైరల్ అయింది.