తిరుమల తిరుపతి దేవస్థానం.. ఎంతో ప్రాముఖ్యత గాంచింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం రోజుకు దాదాపు లక్ష మంది వరకు వస్తారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండపైన సెల్ఫోన్లకు… అసలు అవకాశం లేకుండా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. పకడ్బందీగా సెక్యూరిటీ నిర్వహిస్తున్నారు అధికారులు.
అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని అనివార్య ఘటనలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ భద్రతా లోపం… కారణంగా కొంతమంది సెల్ ఫోన్లు తీసుకువచ్చి కొండపైన ఉన్న అందాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా…తిరుపతి దేవస్థానంలో ఫ్రాంక్ వీడియోల పేరుతో యువకులు హల్ చల్ చేశారు.
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు ఆకతాయిలు. సాధారణంగా దేవస్థానం లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదు… కానీ ఈ యువకులు భద్రత సిబ్బంది కళ్లు కప్పి మరి ఎలా తెచ్చారు. నిర్లక్ష్యం గా వ్యవహరించిన భద్రత సిబ్బంది ఎవరు అనే దానిపై విచారణ చేస్తున్నారు అధికారులు.