పులివెందులకు ఉప ఎన్నికపై వైయస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు ఉప ఎన్నిక కాదు.. పిఠాపురం, మంగళగిరి, కుప్పం తో కలిపి ఉప ఎన్నిక నిర్వహించండంటూ చురకలు అంటించారు వైయస్ అవినాష్ రెడ్డి. సూపర్ సిక్స్ పథకాలను రెఫ్రెండ్ గా తీసుకొని ఎన్నికలకు వెళ్దామంటూ సవాల్ చేశారు. ఉప ఎన్నిక నిర్వహించే దమ్ము మీకు ఉందా…అంటూ నిలదీశారు.
ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండంటూ డిమాండ్ చేశారు వైయస్ అవినాష్ రెడ్డి. ప్రతిపక్ష హోదాతో జగన్ అసెంబ్లీకి వెళ్తే వాళ్లకు సినిమా కనపడతాదని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి కుట్ర చేస్తోందని ఆగ్రహించారు వైయస్ అవినాష్ రెడ్డి. ప్రతిపక్ష హోదా ఇస్తే తాము సందించే ప్రశ్నలకు భయపడే ఇవ్వలేదు… ఉన్నది ఒకే ప్రతిపక్షం అని తెలిపారు. 11 సీట్లు అన్నది లెక్క కాదని వివరించారు వైయస్ అవినాష్ రెడ్డి.