ఆర్.ఆర్.ఆర్. గురించి జగన్ అన్నం తినడం లేదంట!!

-

తాను ఖాళీగా ఉన్నాను కాబట్టి మిగిలినవారు కూడా అలానే ఉన్నారు అని అనుకుంటుంటారు కొంతమంది ఖాళీగా ఉన్న పెద్దలు! సరే వారి సంగతి కాసేపు అటుంచితే… గతకొన్ని రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తనకున్న అక్కసునంతా తీర్చేసుకుంటున్నారు ఆర్.ఆర్.ఆర్.! ఇందులో భాగంగా… రోజుకో రకంగా జగన్ పై అభియోగాలు మోపుతూనే ఉన్నారు! అయితే.. జగన్ తనకు ఎంత విలువిస్తారో ఆర్.ఆర్.ఆర్. కి తెలియంది కాదు! అయినా కూడా ఆర్.ఆర్.ఆర్. తనగురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారనేది తాజా కామెంట్!


“నన్ను అరెస్టు చేయించడానికి సీఎం జగన్‌ పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రయత్నాలు సాగిస్తున్నారు” అని చెప్పుకొస్తున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణం రాజు! సరే అంతవరకే అది చాలా ఎక్కువ మాట్లాడటం అనుకుంటే… “తనను అరెస్టు చేయించేవరకూ అన్నం కూడా తినేట్టు లేరు” అని కూడా అంటున్నారు ఆర్.ఆర్.ఆర్.! రోజు రోజుకీ సమాజం తనను గుర్తించడం లేదనే బాదో, లేక తాను జగన్ కి సమ ఉజ్జీని అని చెప్పుకోవాలనే తాపత్రయమో తెలియదు కానీ… ఇలా ప్రతిరోజూ జగన్ నామజపం చేస్తూ గడిపేస్తున్నారు ఆర్.ఆర్.ఆర్.

దీంతో… అసలు ఆర్.ఆర్.ఆర్. కు జగన్ అంత విలువిస్తున్నారా.. ఆయన గురించి అంతగా ఆలోచిస్తున్నారా.. భోజనం కూడా చేయకుండా ఆర్.ఆర్.ఆర్.పై కాన్సంట్రేషన్ చేస్తున్నారా.. జగన్ కు వేరే పనేమీలేదా.. అంటూ ప్రశ్నలు సందిస్తున్న నెటిజన్లు… “లైట్ బాస్, మీ గురించి మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు” అని ఆర్.ఆర్.ఆర్. కు సూచిస్తున్నారు!! మరి ఆర్.ఆర్.ఆర్. ఇంకా ఆగుతారా లేక తనదైన “రచ్చ”బండ కార్యక్రమంలో భాగంగా పసుపు మీడియాకు ఫుల్ మీల్స్ పెట్టి కాలక్షేపం చేస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version