జగన్ పరిపాలన గురించి చెప్పుకోవడానికి కాని, తప్పులు వెతకడానికి పెద్దగా ఏమీ లేదు. మొదటిసారి సీఎం కుర్చీ ఎక్కినా, అదురు బెదురు లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తూ, ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో ముందుగానే గ్రహిస్తూ, జనరంజక పాలన అందిస్తూ దేశవ్యాప్తంగా డైనమిక్ సీఎం గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ప్రజలు అడిగినా, అడగకపోయినా ప్రజల కష్టాలను గుర్తించి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వంలోనూ ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తిగా పారదర్శకత ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా, పార్టీ విషయానికి వచ్చే సరికి జగన్ పూర్తిగా విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం పరిపాలనపై జగన్ దృష్టి సారించడంతో పార్టీ విషయాలను అంతగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.దీంతో కేడర్లో తీవ్రమైన నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పనిచేసిన తమను పార్టీ పట్టించుకోవడం లేదనే అభిప్రాయంలో చాలామంది అసంతృప్తికి గురవుతున్నారు. జగన్ సీఎం గా చూడాలన్న కోరికతో చాలా ఉంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కష్టపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన. తరువాత జగన్ పరిపాలన మొత్తం అధికారులు చేతుల్లో పెట్టేసి, పార్టీ నాయకులకు ప్రాధాన్యం ఏమీ లేకుండా చేయడం, కనీసం పార్టీ నాయకులను పెద్దగా గుర్తించక పోవడం, ఎమ్మెల్యే ఎంపీలు నియోజకవర్గ స్థాయి నాయకులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఇలా ఎన్నో అంశాలు జగన్ తీరుపై పార్టీ నేతల్లో ఆగ్రహం పెరగడానికి కారణమవుతోంది.
గతంలో టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఇదే విధమైన వైఖరితో ముందుకు వెళ్లడం వంటి వ్యవహారాల కారణంగా పార్టీ నేతల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోయింది. ఫలితంగా ఘోరమైన ఫలితాలను చవి చుడాల్సి వచ్చింది. ఇప్పటికీ పార్టీ క్యాడర్ లో బాబు పై ఇంకా నమ్మకం ఏర్పడలేదు. ప్రభుత్వంపై పోరాడాల్సిన పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా, పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తున్నారు. దీంతో బాబుకు అసలు విషయం బోధపడి తాను పార్టీ విషయంలో చాలా తప్పు చేశానని, ఇకపై ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను అని, పార్టీ నేతలను ప్రాధేయ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు జగన్ వైఖరి చూస్తే ఇదే రకంగా కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు పెరిగిపోయి, నేతల మధ్య సఖ్యత లేకపోవడం, వారిని ఎవరు పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు. పదవుల్లోనూ ఇతర విషయాలను వారికి ప్రాధాన్యత లేకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో పార్టీ కేడర్ లో జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తి ఉంది. ముందు ముందు ఈ వ్యవహారాలు ముదరక ముందే, పార్టీ పైన జగన్ దృష్టి పెట్టి ముందుకు వెళితేనే పరిస్థితి చక్కబడుతుంది. లేకపోతే పార్టీని కాపాడే వారు ఎవరు ఉండరు. ఈ విషయంలో బాబు ఎదుర్కున్న చేదు అనుభవాలను జగన్ గుర్తు పెట్టుకుంటేనే మంచిది.
-Surya