కాస్త కనికరం చుపించయ్యా జగన్ ! పాపం బాబు

-

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పెద్దమనిషి అని కూడా కనికరం లేకుండా, రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి రుద్దీ రుద్దీ మరి చేసి, ఆ హడావిడిలో తనను గెలిపించిన కుప్పం ప్రజలు సంగతి మరిచిపోతూనే వచ్చారు చంద్రబాబు. ఏదో ఒక రోజు మా బాధలు పట్టించుకోక పోతాడా అనుకుంటూ ఎమ్మెల్యేగా గెలిపిస్తూనే వచ్చినా, మన కుప్పం ప్రజలే కదా ఏమీ అనుకోరులే అన్నట్లుగా అభివృద్ధిని చేయడం మర్చిపోయారు. సర్లే ఇప్పుడు చేయకపోయినా తర్వాత అయినా చేస్తాడని ఇంకా ఇంకా ఎదురు చూపులు చూసిన కుప్పం ప్రజలు అలా అభివృద్ధికి దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. అమరావతి ని గ్రాఫిక్స్ లో నిర్మించినట్టుగా, కుప్పం అభివృద్ధికి  చంద్రబాబు పెద్ద ప్రణాళిక  తయారు చేస్తూ, అంతర్జాతీయ నిపుణులతో చర్చిస్తున్న సమయంలో, బాబు గారికి ఎత్తులు కనిపెట్టినట్టు జగన్ చూపు కూడా కుప్పం పై పడింది.

రాష్ట్రమంతా ఏ విధంగా అయితే అభివృద్ధిలో దూసుకు వెళ్లేలా చేస్తున్నారో, సరిగ్గా కుప్పం నియోజకవర్గంలోనూ అదే రకమైన అభివృద్ధిని చేయిస్తూ, భారీ ఎత్తున నిధులను కేటాయిస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లను నిర్మిస్తూ, ఇప్పుడు అక్కడ జగన్ మార్క్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నారు. ఎప్పుడో తాను చేయాలని కలలుకంటున్న అభివృద్ధి మొత్తం జగన్ చేసి చూపిస్తుండడం తో, కుప్పం లో బాబుని ఆడిపోసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు మా నియోజకవర్గం అభివృద్ధి చేస్తాడు.. చేస్తాడు అని ఎదురు చూపులు చూసి విసిగి పోయామని, జగన్ పార్టీకి తాము ఓటు వేయలేదని తెలిసినా, మా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకోవడం చాలా ఆనందం కలిగిస్తోంది అంటూ… పెద్ద ఎత్తున టిడిపి వాళ్లంతా ఇప్పుడు వైసీపీలో చేరిపోతుండడం చూస్తుంటే, కంచుకోట బీటలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
అసలే వచ్చే ఎన్నికల్లో లోకేష్ బాబును రంగంలోకి ఈ నియోజకవర్గం నుంచి దింపాలని చూస్తుంటే , ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబుకు కానీ ఆయన కుమారుడు లోకేష్ కు కానీ, ఈ నియోజకవర్గంలో చోటు లేకుండా చేయాలనే లక్ష్యంతో జగన్ ఇక్కడ అభివృద్ధికి బాటలు వేయడం చూస్తుంటే  బాబులు నిరాశా, నిస్పృహలు, భయాందోళనలు పెరిగిపోతున్నాయి. బాబు మీద జాలి, దయ, కరుణ, ప్రేమ అన్ని చూపిస్తున్న జగన్ ఇప్పుడు కుప్పం లో బాబుకు ఎదురుగాలి వీచేలా చేసి  నిలువనీడ లేకుండా చేయాలని చూస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version