ఏపీ సిఐడి విభాగానికి స్కోచ్ అవార్డుల పంట

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి విభాగానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డులు భారీగా వచ్చాయి. దేశ వ్యాప్తంగా టెక్నాలజీ విభాగంలో నూతన ఆవిష్కరణలకు 84 అవార్డులు అందజేయగా అందులో మెజారిటీ అవార్డులు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కైవసం చేసుకుంది. సిఐడి విభాగం అధ్వర్యంలో రూపొందిన e – నిర్దేశ మరియు ఆపరేషన్ ముస్కాన్ – కోవిడ్ 19 ప్రాజెక్టులకి రజత పతకాలు లభించాయి.

AP CID 4S4U మరియు e- రక్షాబంధన్ లు స్కోచ్ ఆర్డర్ అఫ్ మెరిట్ లో సెమి ఫైనల్ చేరుకున్నాయి. ఇక జూమ్ వేదికగా ఆన్లైన్ లో జరిగిన స్కోచ్ అవార్డుల కార్యక్రమంలో సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ అవార్డ్స్ ని స్వీకరించారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీస్‌ శాఖలలో టెక్నాలజీ వినియోగంలపై స్కొచ్‌ గ్రూప్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లో మొత్తం 84 జాతీయ అవార్డులను ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ 48, కేరళ 9, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ 4, తెలంగాణ, తమిళనాడు చెరొకటి చొప్పున దక్కించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version