అమరావతికి కొత్త శోభ… జగన్ మార్కు ప్లానింగ్ ఇది!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా కీలకంగా మారాయి. సీఆర్డీఏ బిల్లు రద్దుతో వైఎస్ జగన్ వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లైంది. దీంతో అమరావతిలో తనదైన మార్క్ అభివృద్ధి కోసం వైఎస్ జగన్ దృష్టి సారించారు. తాజాగా ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం వీటికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సిఆర్డిఏ రద్దైన తరువాత దాని స్థానంలో ప్రభుత్వం ఏఎంఆర్డిఏను తెరపైకి తీసుకు వచ్చింది.

అయితే సీఆర్డీఏ రద్దు కావడంతో ఇక జగన్ మార్క్ డవలప్మెంట్ కోసం వైసీపీ దృష్టి సారించింది. ప్రధానంగా అమరావతిని మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఏఎంఆర్డిఏను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీఆర్డిఏ కంటే ఏఎంఆర్డిఏ పరిధి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఎలా చేయాలి వంటి వాటిపై ప్ర్తత్యేకంగా కమిటీ వేసింది.

అదేవిధంగా ఏఎంఆర్డిఏకి సంబంధించి పాలక మండలి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏఎంఆర్డిఏ కమిషనర్ గా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని నియమించింది. కృష్ణా గుంటూరు జిల్లాల కలెక్టర్లు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషర్ లు సభ్యులుగా నియమించింది. అమరావతి మెట్రోపాలిటన్ నగరంలో ఎలాంటి నిర్మాణాలు ఉండాలి, నగరంగా ఎలా తీర్చిదిద్దాలి, మెట్రో, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం వంటి విషయాలపై ఈ కమిటీ చర్చించి ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దాలని ఇప్పటికే ప్రభుత్వం కమిటీ సభ్యులను ఆదేశించింది కూడా. చూద్దాం మరి ఇక జగన్ మార్క్ అమరావతి డవలప్మెంట్ అంటే ఏంటో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version