ఏపీలో తాజాగా జరిగిన మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్ పై మాజీ సీఎం YS జగన్ సోషల్ మీఫీయ వేదికగా రియాక్ట్ అయ్యారు. సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.
వైయస్సార్‌సీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యారంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ, అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగాచేసి, మళ్లీ ఇప్పుడు రొటీన్‌గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకోవడం, ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరు. ఇంతటి నటనా కౌశల్యం ఆయనకే సొంతం. టీచర్లు- విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదు. క్రమం తప్పకుండా గతంలో నుండి జరుగుతున్నవే అని మాజీ సీఎం YS జగన్ పేర్కొన్నారు.