మంత్రుల పనితీరుపై సీఎం సంతృప్తి ఉన్నారా..? పార్టీలో జరుగుతున్న తాజా చర్చ ఇదే..

-

మంత్రివర్గ సమావేశమంటేనే మంత్రులు భయపడుతున్నారా..? చంద్రబాబు ఆదేశాలు, పరోక్ష హెచ్చరికలతో మంత్రులకు వెన్నులో వణుకు పుడుతోందా..? ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో చంద్రబాబుకు చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి..? ఇంతకీ మంత్రివర్గంలో జరుగుతున్న చర్చ ఏంటి..? లెట్స్ వాచ్..

పాలనలో సీఎం చంద్రబాబునాయుడు చాలా కఠినంగా ఉంటారు.. తప్పుచేస్తే ఎవ్వరినీ ఊపేక్షించారు.. మంత్రులైనా, ఎమ్మెల్యేలనైనా సైలెంట్ గా పక్కనపెట్టేస్తారు.. పార్టీకి చెడ్డపేరు తీసుఎకొచ్చే వారి పట్ల కూడా నిర్మోహమాటంగా ఉంటారని రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట.. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో జరిగిన కొన్ని ఘటనలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్..

ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీ తర్వాత సీఎం చంద్రబాబునాయుడు మంత్రులతో సమావేశమయ్యారు.. తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు. వారంలో రెండు సార్లు మంత్రుల పనితీరుపై సమీక్షిస్తానని ఆయన చెప్పారు. అలాగే డీఆర్సీ సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేశారు..? ఇన్చార్జిగా ఉన్న జిల్లాకు ఎన్ని సార్లు వెళ్లారు.? పైల్స్ ను ఎంత త్వరగా క్లియర్ చేస్తున్నారు..? వంటి వాటిపై మంత్రులతో మాట్లాడారట.. కొందరు మంత్రులు పైల్స్ పెండింగ్ పెడుతున్నారని, ఇది సరైన పద్దతికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. టెక్నాలజీ వాడుకోవడంలో కొందరు మంత్రులు విఫలమవుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారట..

ఆరునెలలకొకసారి పనితీరుపై నివేదిక ఇవ్వాలని కోరినా.. కొందరు మంత్రులు ఇంత వరకు ఇవ్వలేదని.. నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ కొందరిని ఉద్దేశించి చంద్రబాబు పైర్ అయ్యారని పార్టీలో చర్చ నడుస్తోంది.. ఇన్చార్జ్ మంత్రులుగా ఉన్నవారు.. చాలా బాధ్యతగా ఉండాలని.. మూడు పార్టీలను సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు సూచించారట.. స్థానికంగా ఎమ్మెల్యేలకు సమస్యలుంటే.. వారికి అండగా నిలవాలని ఆదేశించారని తెలుస్తోంది..

పనిచేసే మంత్రులెవ్వరో.. పనిచెయ్యనివారెవ్వరో తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తున్నట్లు చంద్రబాబు బాంబ్ పేల్చారట.. మంత్రుల జాతకాలన్నీ తన వద్ద ఉన్నాయని.. ప్రతి ఒక్కరూ పార్టీ లైన్ దాటి మాట్టాడొద్దని.. అదే సమయంలో వైసీపీ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని చూసించారట. మొత్తంగా కొందరు మంత్రుల పనితీరుపై సీఎం అసంతృఫ్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version