టెస్టులు – కేసులు: ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్!

-

కరోనా కేసులు విషయంలో రోజు రోజుకీ అర్ధం పర్థం లేని, అవగాహన రాహిత్యంతో ఒక వర్గం మీడియా, ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానంగా అన్నట్లుగా తాజాగా జగన్ మీడియాతో మాట్లాడారు! ఈ సమావేశంలో… విమర్శలకు బుగ్గలు ఎర్రబడేలా సమాధానం ఇచ్చారు. పొద్దున్న లేస్తే… కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. పెరిగిపోతున్నాయంటూ వస్తున్న అర్ధరహిత విమర్శలకు అత్యంత క్లారిటీ గా చెప్పారు జగన్. నిజంగా బ్రెయిన్ ఉన్నవారు ఎవరైనా… ఇంత క్లారిటీగా చెప్పిన అనంతరం కేసులు పెరుగుతున్నాయనకుండా… కేసులు బయటపడుతున్నాయని అర్ధం చేసుకోగలరని పలువురు కోరుకుంటున్నారు!

వివరాళ్లోకి వెళ్తే… దేశంలోనే అత్యధిక కరోనా వైరస్‌ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని, ప్రతి 10 లక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తున్నామని.. ఈఇ లెక్క దేశం మొత్తం మీద 400 మాత్రమే ఉందని .. దేశంలోనే అత్యధిక టెస్టులు ఏపీలోనే చేస్తున్నాం అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈనెల రోజుల్లో టెస్టింగ్‌ సౌకర్యాలను పెంచుకున్నామని, కరోనా వైద్య పరీక్షల కోసం రాష్ట్రంలో 9 వీఆర్‌డీఎల్‌, 44 ట్రూనాట్‌ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేశామని .. ఇందులో భాగంగా… ఇప్పటివరకు 74,551 టెస్టులు చేశామని వెల్లడించారు. ఇదే సమయంలో లాక్‌ డౌన్‌ కు సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలియజేశారు ఏపీ సీఎం. అదేవిధంగా… కరోనా వ్యాధి సోకితే అంటరానితనంగా భావించొద్దని.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమైపోతుందని జగన్ తెలిపారు.

ఇదేక్రమంలో… రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను ఇప్పటికే పూర్తిగా మండలాలవారీగా గుర్తించామని చెప్పిన జగన్… ఏపీలో 63 రెడ్‌జోన్‌ లు, 54 ఆరెంజ్‌ జోన్‌ లు , 559 గ్రీన్‌ జోన్‌ లు గా మండలాలున్నాయని క్లారిటీగా చెప్పారు. ప్రస్తుతం ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నా కూడా… సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జగన్.. ప్రజలకు మరింత దైర్యం కలిగించారు!

Read more RELATED
Recommended to you

Latest news