సినిమా చూపిస్తోన్న జగన్: బాబు కుర్చీ కిందకు నీళ్లు… 1978 సీన్ రిపీట్!!

-

బాబుకు ప్రస్తుతం మామూలు బ్యాడ్ టైం నడవడం లేదు! ఏది పట్టుకున్న మట్టైపోవడం సంగతి అటుంచితే.. విలువైనవన్నీ చేజారిపోతున్నాయి. ఎలాంటి టీడీపీ, ఎలాంటి చంద్రబాబు.. అందితే కాళ్లు, అందకపొతే జుట్టు పట్టుకునైనా నెట్టుకురాగల చంద్రబాబు నేడు.. 1978వ రోజుల్లోకి వెళ్లిపోబోతున్నారని విషయం దాదాపు కన్ ఫాం అయిపోయిందని అంటున్నారు విశ్లేషకులు! అందుకు పక్కా సమాచారం ఉందనేది మరికొందరి స్ట్రాంగ్ మాట!

వివరాళ్లోకి వెళ్తే… చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోయే రోజుకు కూడా పక్కాగా స్కెచ్ వేసి మరీ ముహూర్తం పెట్టారంట జగన్. ఈ సమయంలో జగన్ కు ఆయుధంలా ఉపయోగపడుతున్నది గంటా శ్రీనివాస్ అని చెబుతున్నారు! అవును… వీలైనంత తొందర్లో గంటా శ్రీనివాస్ వైకాపా తీర్ధం పుచ్చుకోనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్ధం కూడా రాజమర్గంలోనే వెళ్లి తీసుకోబోతున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. తానొక్కడినే వైకాపాలోకి వెళ్లడం కంటే తన స్థాయిని చూపించాలని ఆలోచిస్తున్నారంట గంటా.

ఇందులో భాగంగా ఆయనతోపాటు విశాఖలో గెలిచిన మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో కనీసం ఒకరిద్దరిని పట్టుకుపోవాలని భావిస్తున్నారంట గంటా శ్రీను. ఇదే క్రమంలో విశాఖలో నివాసం ఉంటున్న శ్రీకాకుళానికి సంబందించిన మరో ఎమ్మెల్యేని కూడా తీసుకుపోవాలని.. ఫలితంగా వైకాపాలోకి “తాను ప్లస్ టు ఆర్ త్రీ” ఎంట్రీ కూడా ఘనంగా ఉంటుందని భావిస్తున్నారంట. సో… గంటా భావిస్తున్నట్లుగా ఆ ఎంట్రీలు జరిగితే చంద్రబాబుకు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పోయినట్లే!!

అవును… వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం ల రూపంలో ఇప్పటికే 23 కాస్త 20 అయిన పరిస్థితి.. ఈ పరిస్థితుల్లో గంటా చెబుతున్నట్లు ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు గంతగుప్పగా వచ్చి వైకాపాలో చేరిపోతే బాబు పరిస్థితి వర్ణణాతీతం! ఫలితంగా బాబుకు ఫ్ల్యాష్ బ్యాక్ సినిమా జగన్ చూపించినట్లే. ఎందుకంటే… 1978లో కాంగ్రెస్ తరఫున కేవలం అయిదు వేల ఓట్లతో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సింగిల్ గా, సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రవేశించారు. నేడు జగన్ వ్యూహం ఫలించి బాబు కుర్చీ కిందకు నీళ్లొస్తే… మరోసారి బాబు ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ప్రవేశించాల్సి వస్తోంది. ఈ వయసులో.. ఇంత బ్రతుకు బ్రతికి.. ఇలాంటి పరిస్థితి వస్తే బాబు ఏమి చేస్తారు.. ఎలా ఆలోచిస్తారు.. అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ఇది బాబుకు ఈ ఏజ్ లో కోలుకోలేని దెబ్బే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version