గ్రామాలపై జగన్ కోరుకునే తన ముద్ర ఇదే!

-

ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా.. వారిలో చాలామంది పరిపాలనలో తన మార్కు ఉండాలని కోరుకుంటుంటారు! కానీ అతికొద్ది మంది మాత్రమే అభివృద్ధిలో, దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లో తన మార్కు, తన ముద్ర ఉండాలని కోరుకుంటారు. అవును… దేశాభివృద్ది గ్రామాల అభివృద్దిపైనే ఆధారపడి ఉందన్ని స్వాతంత్రం ముందు నుంచి చెబుతున్నా… రాజధానులపై ఉన్న శ్రద్ధ గ్రామాలపై పెట్టడం లేదు నాయకులు! ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం… గ్రామాలపై తన ముద్ర ఉండాలన్ని కోరుకుంటున్నారు.

అవును… గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు అంటూ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ పరిపాలనను గ్రామస్థాయి నుంచి ఆలోచిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… కరోనా అనంతర పరిణామాల్లో గ్రామాల అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని అధికారులకు సూచిస్తున్నారు. బ్రతికుంటే బలిసాకు తిని అయినా బ్రతకొచ్చని ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలంతా.. తిరిగి గ్రామాలకు చేరుటుండటంతో… ఉపాది హామీ పని దినాలు పెంచాలని జగన్ అధికారులకు సూచిస్తున్నారు.

ఈ విషయాలపై తాజాగా కలెక్టర్లు, ఎస్పీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో… గ్రామాల విషయంలో తన విజన్, తన కోరిక ఎంత బలమైనవో వివరించారు ఏపీ ముఖ్యమంత్రి. ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య ఉండకూడదని… వీలైన అన్ని చోట్లా బోర్లు వేయాలని, అవకాశం లేని చోట్ల ట్యాంకర్లతో నీరందించాలని సూచించారు జగన్. ఇదే సమయంలో… గ్రామాల్లోకి అడుగు పెట్టినప్పుడు… అభివృద్ధి చెందిన పాఠశాల, నిరంతరం ఏఎన్ఎం ఉండే విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, జనతా బజార్, గ్రామ సచివాలయం ఉండాలి అని.. అప్పుడే గ్రామాలపై మన ముద్ర కనిపిస్తుందని జగన్ అధికారులకు సూచిస్తూ… గ్రామాల అభివృద్ధిపై తనకున్న చిత్తశుద్ధిని మరోసారి తెలియపరిచారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version