వైఎస్‌ షర్మిల సంచలన నిర్ణయం..బస్సు యాత్రకు శ్రీకారం..షెడ్యూల్‌ ఇదే

-

వైఎస్‌ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వంత గడ్డ కడపపై నుంచే షర్మిల ఎన్నికల శంఖారావం మోగించనున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి బస్సు యాత్ర నిర్వహించనున్నారు షర్మిల. ఇక వైయస్ షర్మిల రెడ్డి బస్సు యాత్ర షెడ్యూల్ ఒక సారీ పరిశీలిస్తే.. కడప జిల్లాలో ఎనిమిది రోజుల పాటు బస్సు యాత్ర ఉంటుంది.

YS Sharmila’s responsibilities as AP PCC chief today

అన్ని మండలాల ప్రజలతో కలిసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ నెల 5వ కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి. కోడూరు, గోపవరం..6వ తేదీన బద్వేల్, అట్లూరు, కడపలో వైయస్ షర్మిల రెడ్డి బస్సు యాత్ర ఉంటుంది. 7వ తేదీ దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు, బి. మఠం..8వ తేదీ కమలాపురం, వల్లూరు చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపునాయిని పల్లి,
10వ తేదీ చక్రాయపేట, వేంపల్లి, వేముల, పులివెందుల, సింహాద్రిపురం, లింగాలలో వైయస్ షర్మిల రెడ్డి బస్సు యాత్ర ఉంటుంది. 11వ తేదీన తొండూరు, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైలవరం..12వ తేదీన జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు, రాజుపాలెంలో వైయస్ షర్మిల రెడ్డి బస్సు యాత్ర ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news