‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్ విడుదల

-

తెలుగు హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. 2014లో కామెడీ అండ్ హార్ర‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి క‌థ‌నాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా.. సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. కోన వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లేను అందిస్తుండ‌గా.. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌తో పాటు.. ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే తాజాగా మూవీ నుంచి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్.

మొద‌టి పార్ట్‌లో లాగానే ఈ సినిమాలో కూడా శ్రీనివాస్‌ రెడ్డి ద‌ర్శ‌కుడిగా న‌టిస్తుండ‌గా.. హార్ర‌ర్ సినిమా తీద్దామని అంజ‌లి, తన టీమ్‌తో కలిసి ఒక పాడుబ‌డిన భ‌వంతిలోకి వెళతారు. అయితే ఆ భ‌వంతీలో షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. వారికి దెయ్యాలు ఉన్న‌ట్లు అనుకొని సంఘ‌ట‌న‌లు ఎదురవుతుంటాయి. అయితే ఆ ఇంట్లో ఉన్న మూడు దెయ్యాలు ఎక్క‌డివి.. వారికి ఏం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే అంజలి అండ్ టీమ్ ఏం చేసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news