వైసీపీ మేనిఫెస్టోపై షర్మిల సెటైర్లు..మూడు రాజధానులు ఏమయ్యాయి…?

-

వైసీపీ మేనిఫెస్టోపై షర్మిల సెటైర్లు వేశారు. సీఎం జగన్ 2019 మేనిఫెస్టో లో ప్రవేశ పెట్టి నెరవేర్చని అంశాలు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని…ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. 2024 మేనిఫెస్టో లో ప్రత్యేక హోదా ప్రస్తావన ఏది? బీజేపీ మెడలు వంచి అయినా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మీరు చేసింది ఏంటి అంటూ నిలదీశారు. పోలవరం సంగతి ఏమైంది? మూడు రాజధానులు ఏమయ్యాయని నిలదీశారు.

YS Sharmila Owes Jagan Rs 82 Crore, As Per Affidavit Nation

పూర్తి మధ్యపానం నిషేధం అని చెప్పి మాట తిప్పారు…ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఎలక్షన్స్ లో ఓట్లు అడుగుతారన్నారు.ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అనేక బ్రాండ్స్ తీసుకొచ్చారు…అవి తాగి రాష్ట్రంలో 25 శాతం మంది ప్రజలు లిక్కర్ తాగి చనిపోవడానికి కారణం వైసీపీ ప్రభుత్వం అంటూ ఫైర్‌ అయ్యారు. జాబ్ కాలెండర్ సంగతి ఏమైంది…5 ఏళ్ళల్లో ఒక్క జాబ్ కాలెండర్ కూడా రాలేదని నిలదీశారు. 2 లక్షలు 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి భర్తీ చేయలేదు… మీ కార్యకర్తలు కు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి అవే ప్రభుత్వ ఉద్యోగాలు అని మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version