ఇవాళ వివేకానంద రెడ్డి కూతురు సునీతతో వైయస్ షర్మిల భేటీ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో అనే పరిస్థితి నెలకొంది. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఆమె వైసిపి పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను టార్గెట్ చేస్తూ కలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ దివంగత వివేకానంద రెడ్డి కూతురు సునీతతో వైయస్ షర్మిల సమావేశం కానున్నారు.

ys sharmila meets sunitha

వీరిద్దరి సమావేశం ఇడుపులపాయలో జరగనుంది. ఈ సందర్భంగా సునీత రాజకీయ ప్రవేశం పై చర్చ జరుగుతుందని సమాచారం అందుతోంది. దీంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. తన తండ్రి హత్య కేసు పై ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మరియు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తో పాటు పలువురుని సిబిఐ నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో వైయస్ షర్మిల… సునీత సమావేశం ఆసక్తిని రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version