BRS అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ : షర్మిల

-

BRS అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ వైఎస్‌ షర్మిల విమర్శలు చేశారు. టీఆరెఎస్ పార్టీ కాస్త భారతీయ రాష్ట్ర సమితి అయ్యిందట..! Trs పార్టీ కాస్త BRS అయ్యిందని గొప్పలు చెప్పుకుంటున్నారని చురకలు అంటించారు. ప్రజలంతా నవ్వి పోతున్నారు..కేసీఆర్ సిగ్గులేకుండా ఒక ప్లీనరీ పెట్టారని ఆగ్రహించారు. మొదటి తీర్మానం వడ్లు కొంటాం అన్నందుకు అభినందన తీర్మానం అంట అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

కేసీఆర్ కి సిగ్గు ఉండాలి… బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి ..ఇవ్వబోమని సంతకం పెట్టింది కేసీఆర్ కదా అని ప్రశ్నించారు. ఇందుకు పెట్టుకోవాల్సింది అభినందన తీర్మానమని… సిగ్గు లేకుండా ముఖ్యమంత్రిగా ఉండి వరి వేసుకుంటే ఉరే అని చెప్పినందుకు పెట్టుకోవాల్సింది అభినందన తీర్మానం అన్నారు.

మెడలు వంచుతాం… పోరాటం చేస్తాం… అని పెద్ద రాగం తీసి గంట సేపు రాగం తీసి వచ్చినందుకు పెట్టుకోవాల్సింది అభినందన తీర్మానం అని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పిన మాట కి 17 లక్షల ఎకరాల్లో పంట వేయలేదు… ఇందుకు పెట్టుకోవాల్సింది అభినందన తీర్మానం అని ఆగ్రహించారు. 8 వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్నందుకు పెట్టాల్సింది అభినందన తీర్మానమని చురకలు అంటించారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version