ఇవాళ ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు !

-

ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు అయింది. ఇవాళ ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే.. ఇవాళ విజయవాడకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పయనం అవుతున్నారు. గన్నవరం విమానాశ్రయానికి 9.30 చేరుకుని కానూరు లో బాధ్యతలు చేపట్టే సభలో పాల్గొననున్నారు షర్మిల.

YS Sharmila’s responsibilities as AP PCC chief today

అనంతరం బెజవాడలో కాంగ్రెస్ ఆఫీస్ కు రానున్నారు షర్మిల. ఉదయం 11 గంటలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారట. కాగా జనవరి 16న ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది. ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిలను నియామకం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version