నేడు సీబీఐ కోర్టుకు వైయస్ వివేకా హత్య కేసు నిందితులు హాజరుకానున్నారు. చంచల్ గూడ జైల్లో జ్యుడీషియల్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులతో పాటు సీబీఐ కోర్టుకి హాజరుకానున్నారు గంగిరెడ్డి, దస్తగిరి. నాంపల్లి సీబీఐ కోర్టుకు విచారణ బదిలీ అయిన తర్వాత ఫిబ్రవరి 10న కోర్టు ఎదుట నిందితులు హాజరయ్యారు. మార్చి 10వ తేదీకి విచారణ వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
అటు హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు. మరి కొద్ది సేపట్లో కార్యకర్తలతో కలిసి కొటీలోని సిపిఐ కార్యాలయానికి బయలు దేరి వెళ్ళనున్నారు అవినాష్ రెడ్డి. నేడు విచారణకు హజరు కావాల్సిందిగా ఎంపి అవినాష్ రెడ్డి కు సి బి ఐ నోటీస్ లు ఇచ్చింది. 160 కింద నోటీస్ ఇచ్చిన సిబిఐ.. ఇవాళ హాజరు కావాలని కోరింది. ఇక అటు తెలంగాణ హై కోర్టు లో ఇప్పటికే పిటిషన్ వేసిన అవినాష్ రెడ్డి.. వివేక హత్య కేసులో తనను సి బి ఐ విచారించకుండా స్టే ఇవ్వాలని కోరారు.