నేడు జగన్ ప్రెస్ మీట్… ఎప్పుడంటే ?

-

నేడు జగన్ ప్రెస్ మీట్ ఉండనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో ముఖాముఖి కానున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయ పరిణామాలు, బడ్జెట్ అంశాలు, సూపర్ సిక్స్ హామీల అమలు, అలాగే వైసీపీ నేతల అరెస్టులపై మాట్లాడనున్నట్టు సమాచారం.

YSR Congress Party President and former CM YS Jagan will meet the media at 11 am today

ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక అటు నేడు విశాఖ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండనుంది. ఉ.11కు విశాఖ ఎయిర్‌పోర్టుకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. మ.1:30కి ఢిల్లీ చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news