ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త…ఈ బీసీ నేస్తం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. అర్హులైన మహిళల ఖాతాల్లో రూ. 15,000 ప్రభుత్వం జమ చేసింది. కాగా, మార్చి 14న నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం జగన్ ఈబీసీ నేస్తం నిధులకు సంబంధించి బటన్ నొక్కారు.
ఈ పథకానికి మొత్తం రూ. 629 కోట్లు కేటాయించారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా డిబిటి నిధులు ఆగిపోయాయి. తిరిగి ఈసీ ఆదేశాలతో ఈ ప్రక్రియ మొదలైంది. ఇక అటు ఏపీ ప్రజలకు అలర్ట్. ఆరోగ్య శ్రీ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (మే 22వ తేదీ) నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని వెల్లడించింది. గత ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉందని చెప్పింది.