వైఎస్సార్ బీమాకు చంద్రన్న బీమా పేరు మార్పు !

-

చంద్రబాబు సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ బీమా పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ బీమాకు చంద్రన్న బీమా పేరు పునరుద్దరణ చేశారు. 2014-19 మధ్య కాలంలో చంద్రన్న బీమా పేరుతో పథకం అమలు చేయనుంది.

YSR insurance scheme now Chandranna Bima Yojana

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…కీలక ప్రకటన చేసింది. ఇక అటు ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేశారు పురంధేశ్వరి. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు పురంధేశ్వరి లేఖ రాశారు. ఇసుక తవ్వకాలకు డిజిటల్ చెల్లింపులు జరిగేలా చెయ్యాలని డిమాండ్‌ చేశారు పురంధేశ్వరి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రమాణాలను పాటిస్తూ ఇసుక తవ్వకాలు జరగాలని.. భారీ మెషీన్లతో ఇసుక తవ్వకాలు జరపకూడదని డిమాండ్‌ చేశారు.

గత ఐదేళ్ళలో జరిగిన ఇసుక తవ్వకాలపై విచారణ జరిపించాలని… టాటా, బిర్లా ల ద్వారా శుద్ధి చేసిన ఇసుక 25 కేజీల బస్తాలలో అందించేలా చూడాలని కోరారు. ఇక అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లారు. ఈ సందర్భంగా ఐదేళ్ల వైసీపీ వేధింపులను ప్రస్తావించారట సుజనా చౌదరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version