సెంట్రల్‌ జైలు కిటికి నుంచి రాజమండ్రి అభివృద్ధిని చంద్రబాబు చూశాడు – ఎంపీ భరత్

-

సెంట్రల్‌ జైలు కిటికి నుంచి రాజమండ్రి అభివృద్ధిని చంద్రబాబు చూశాడని రామమండ్రి వైసీపీ ఎంపీ భరత్ సెటైర్లు పేల్చారు. విభజించిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి అన్యాయం చేసింది చంద్రబాబు అని.. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టింది చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహించారు.

YSRCP MP Margani Bharat Serious Comments On Chandrababu Naidu

రీల్ ఎంపీ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన భరత్…పార్లమెంట్లో నేను లేవనెత్తిన ఎక్కువ అంశాలు ఎవరు ప్రస్తావించలేదని వెల్లడించారు. ఆవ భూముల్లో 150 కోట్లు దోచేశానని, అభివృద్ధి పనుల్లో పదిహేను శాతం కమిషన్లు తీసుకుంటున్నట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలగుతానని సవాల్‌ చేశారు.

విమర్శలు చేసే ముందు చంద్రబాబు ఆలోచన చేయాలి…రాజమండ్రిలో టంగుటూరి ప్రకాశం పంతులు పార్కును ఎన్టీఆర్ పార్క్ గా మార్చేసారన్నారు. ఇంత దుర్మార్గం మరొకటి లేదని ఆగ్రహించారు. ఈ పార్కుకు తిరిగి ప్రకాశం పంతులు పార్కుగా మార్పు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను కోరతామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version