ఎన్నికల కమిషన్ కు వైసీపీ పార్టీ సంచలన లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమకు గొడ్డలి గుర్తు కావాలంటూ ఎన్నికల సంఘానికి వైసీపీ పార్టీ లేక రాసిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ సింబల్ ను తొలగించి గొడ్డలి గుర్తు కేటాయించాలని వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి.

అయితే ఈ లేఖ విషయంలో వైసిపి నేతలు ఎవరు స్పందించలేదు. టిడిపి నేతలు కావాలనే ఈ లేఖను రాసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని కార్యకర్తలు అయితే ఫైర్ అవుతున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నేపథ్యంలో… వైసిపి పార్టీని ఇరికించేందుకు ఇలా టిడిపి సోషల్ మీడియా వ్యవహరిస్తోందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదని… కావాలనే టీడీపీ కుట్రలు చేస్తుందని ఫైర్ అవుతున్నారు వైసీపీ కార్యకర్తలు. దీనిపై వెంటనే జగన్మోహన్ రెడ్డి స్పందించి.. లేఖ రాసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గొడ్డలి గుర్తు కావాలంటూ ఎలక్షన్ కమిషన్ కు వైసీపీ లేఖ..
ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ సింబల్ కి బదులు గొడ్డలి గుర్తు కేటాయించాలని లేఖ రాసిన వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ pic.twitter.com/eG7JFDs6hL
— BIG TV Breaking News (@bigtvtelugu) July 15, 2025